తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓస్) నల్గొండ జిల్లా యూనిట్‌కు సంబంధించిన క్యాలెండర్లను నేడు హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ గోనమోహన్ రావు, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ ఆర్. శ్రీనివాస మూర్తి, నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ బోడా యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బి. యాకుబ్ నాయక్‌తో పాటు ఇతర పదాధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో గెజిటెడ్ అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సంఘం నేతలు పరిపాలనా సమర్థతను మరింత బలోపేతం చేస్తూ ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
Discover more from blueviolet-salmon-673843.hostingersite.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments