నల్లగొండ రాజకీయ వేదికపై బిజెపిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మేయర్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు కీలక నాయకులు ముందుకు రావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిన్నటి వరకు పరస్పరం విమర్శలు చేసుకున్న నాయకులు, ఈరోజు ఒకే వేదికపై కనిపించడంతో బిజెపి కార్యకర్తల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. పిల్లి రామరాజు – వర్షిత్ రెడ్డి మధ్య రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఈరోజు బిజెపి కార్యాలయంలో పిల్లి రామరాజు ఆధ్వర్యంలో 13వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉట్కూరి వెంకట్ రెడ్డిని వర్షిత్ రెడ్డి పార్టీ కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానించారు.
ఇప్పటికే 10వ వార్డు నుంచి నాగం వర్షిత్ రెడ్డి తమ్ముడు పోటీ చేస్తున్నట్టు ప్రచారం కొనసాగుతుండగా, అదే వార్డుకు పిల్లి రామరాజు యాదవ్ తమ్ముడు కృష్ణంరాజు బిజెపి తరఫున నిన్న నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ ఆసక్తిని మరింత పెంచింది.
ఒకవైపు పిల్లి రామరాజు ఎంట్రీతో బిజెపికి పునర్ వైభవం వచ్చిందని కొందరు భావిస్తుండగా, మరోవైపు మేయర్ పీఠం కోసం అంతర్గత పోరు మళ్లీ తలెత్తే అవకాశాలపై కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురు నాయకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై బిజెపి సీనియర్ నేతలు ఆలోచనలో పడ్డట్టు సమాచారం.
Discover more from blueviolet-salmon-673843.hostingersite.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments