ePaper
Saturday, March 28, 2026

నల్లగొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా… గంధంవారిగూడెం శ్రీ మాణిక్యేశ్వరి మాత ఆశ్రమంలో ప్రత్యేక పూజలు

నల్లగొండ:
గంధంవారిగూడెం, నల్లగొండలోని శ్రీ శ్రీ శ్రీ జగద్గురు బాలయోగిని మాణిక్యేశ్వరి మాత ఆశ్రమంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 11, 2026న ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

ఓంకార స్వరూపమైన దత్తాత్రేయుని ఆరాధనతో పాటు, ఆశ్రమంలో ప్రతి రోజు ఉదయం 8:00 గంటలకు, సాయంత్రం 6:00 గంటలకు స్థాపన, కలశ పూజలు మరియు పూజ్య మాత శ్రీ మాణిక్యేశ్వరి మాత పాద పూజలు నిర్వహించబడతాయి. మహాశివరాత్రి రోజున ఉదయం 10:00 గంటలకు అమ్మవారి పాదుకలకు మహా అభిషేకం నిర్వహించనున్నారు.

అలాగే నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు దుర్గామాత, ఆంజనేయ స్వామి అభిషేకాలు మరియు శ్రీశివుడికి మహా రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం తీర్థ ప్రసాద విఠరణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వాదాలు పొందాలని ఆశ్రమం తరఫున ఆహ్వానం పలికారు. ఇతర వివరాల కోసం ఆశ్రమాన్ని సంప్రదించాలని సూచించారు.

ప్రధాన కార్యదర్శి: గంగాధర్ స్వామి
సంప్రదించవలసిన ఫోన్: 7702893094


Discover more from blueviolet-salmon-673843.hostingersite.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!