ePaper
Wednesday, March 25, 2026

ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో రాజీ పడవద్దు.
@ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి ఆదేశం.
బుధవారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలు, తదితర అంశాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్ ను అడిగి తెలుసుకున్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, టాయిలెట్స్, తాగునీరు, క్లాక్ రూమ్, ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్ల డిపాజిట్, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారి వెంట తీసుకువచ్చిన పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, వాచ్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిని భద్రపరచుకునేందుకు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తప్పనిసరిగా క్లాక్ రూమ్ ఏర్పాటు చేయాలని పునరుద్గటించారు.అలాగే అన్ని పరీక్ష కేంద్రాలలో తాగునీటితోపాటు, విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యం కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లో నుంచి క్వశ్చన్ పేపర్లను జాగ్రత్తగా బందోబస్తుతోపాటు తీసుకురావాలని, అలాగే ఆన్సర్ సీట్లు సైతం పోలీస్ భద్రతతో డిపాజిట్ చేయాలని చెప్పారు. ఇంటర్ పరీక్షల సందర్భంగా జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగడానికి వీలులేదని, అంతేకాక విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
కాగా బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 18 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనుండగా, జిల్లా నుండి మొదటి, రెండవ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలుపుకొని 27018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మొదటి రోజు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కలుపుకొని 97% హాజరు నమోదయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి తెలిపారు.


Discover more from blueviolet-salmon-673843.hostingersite.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!