ePaper
Thursday, March 19, 2026

మార్పు మనతోనే ప్రారంభమైంది: రోడ్డులో గుంత పూడ్చిన ‘మన సిరిసిల్ల’ యువత

నవీన్ కుమార్, చీకటి వెలుగు — సిరిసిల్ల, డిసెంబర్ 1, 2025

సామాజిక బాధ్యతగా ముందడుగు వేసిన సిరిసిల్ల యువకుల సేవా కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది.

సమాజంలో మార్పు కోసం ఎదుటివారి కోసం ఎదురుచూడకుండా, మార్పు మనతోనే మొదలవ్వాలి అనే భావనతో ‘మన సిరిసిల్ల’ టీం ఉదాహరణగా నిలిచింది.

‘మన సిరిసిల్ల’ ఇన్‌స్టాగ్రామ్–యూట్యూబ్ అడ్మిన్ నక్క నవీన్ కుమార్, తన స్నేహితులు శ్రీకాంత్ (వివానా డ్రైవింగ్ స్కూల్), శివ కలిసి కామారెడ్డి రోడ్డులోని కార్గిల్ దగ్గర ఏర్పడిన పెద్ద గుంతను ఎర్ర మొరం, సన్నపు కంకరతో పూడ్చారు.

వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టారు.

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ,

“రోడ్లలో ఉన్న ఇలాంటి సమస్యలను ప్రభుత్వం గుర్తించి త్వరగా పరిష్కరించాలని మా విన్నపం” అని పేర్కొన్నారు.

సేవలో చేరిన మిత్రులకు నవీన్ ధన్యవాదాలు తెలుపుతూ,

ఇలాంటి చిన్న సేవా కార్యక్రమాలు కూడా సమాజానికి పెద్ద మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల కోసం ఏదో ఒక మంచి పని చేయాలని పిలుపునిచ్చారు.


Discover more from blueviolet-salmon-673843.hostingersite.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!